తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. తెలంగాణ నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైంది. ఈరోజు ఉత్తర, మధ్య తెలంగాణ నుంచి రుతుపవనాలు వెళ్లిపోతుండగా, రేపటికల్లా పూర్తిస్థాయిలో తెలంగాణ నుంచి వెళ్లిపోతాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. దీంతో హైదరాబాద్ లో 35, ఆదిలాబాద్లో 37, భద్రాచలం, మహబూబ్ నగర్ లో 36.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనివల్ల శీతాకాలంలోనూ ప్రజలు ఉక్కపోతతో అసౌకర్యానికి గురవుతున్నారు.