దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా ముడి చమురు ధరలు పెరగడం, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ నిధులు తరలిపోతుండటం మార్కెట్ కు ప్రతికూలంగా మారాయి. దీంతో సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా కుంగింది. నిఫ్టీ 350 పాయింట్లకు పైగా పతనమైంది. మధ్యాహ్నం 1.30 గంటలకు సెన్సెక్స్ 1,076.34 పాయింట్లు దిగజారి 71,562.36 వద్ద ట్రేడవుతోంది.ఐటీసీ, అదానీ పోర్ట్స్, ఇండిగో, పవర్ గ్రిడ్, రిలయన్స్, బీఈఎల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.