భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రం ‘రామాయణ’. నమిత్ మల్హోత్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా నమిత్ మల్హోత్రకు చెందిన కార్యాలయాల్లో ఆదాయపు పన్ను విభాగం (ఐటి) అధికారులు సోదాలు నిర్వహించారు. ముంబైలోని ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్ కార్యాలయాలతో పాటు సంస్థ ఆర్థిక సలహాదారులు, సిఎ ఆఫీసుల్లో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. విదేశీ లావాదేవీలు, నిధుల బదిలీ, పన్నులకు సంబంధించిన వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే ఈ తనిఖీలకు సంబంధించి ఆదాయపు పన్ను విభాగం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.