కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్దమవుతోంది. అయితే ఇప్పటివరకూ అనుకుంటున్న దానికి భిన్నంగా ఈ నెలాఖరుకు బదులు వచ్చే నెలలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ఇది జరిగే అవకాశం ఉంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను తప్పించడం, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు విద్యాశాఖ అప్పగించి, ఆమె శాఖకు మంత్రిగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ను తీసుకురావడం, అనురాగ్ ఠాకూర్ ను తిరిగి కేబినెట్లోకి తీసుకోవడం వంటి మార్పులు చేయబోతున్నారు.