ఏపీ నేతలు హైదరాబాద్‌లో భూ కబ్జాకు తెరలేపుతున్న ఘటనలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని వేల కోట్ల విలువైన 112 ఎకరాల IT పార్క్ స్థలం కబ్జాకు యత్నం చేసినట్టు కేశినేని నాని సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ప్రగతి నగర్ – శాంషీగూడలో ఐటీ కారిడార్ విస్తరణ కోసం TGIICకి కేటాయించిన అత్యంత విలువైన 112.72 ఎకరాల భూమిని కేశినేని చిన్ని కుటుంబ సభ్యుల బినామీ ఎక్సెల్లా ప్రాపర్టీస్ ద్వారా ఆక్రమించేందుకు యత్నిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.