గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నానితో పాటు పలువురు ముఖ్య నేతలపై పోలీసులు FIR నమోదు చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లి CI స్వయంగా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఒక కేసు,TDP విద్యార్థి అధ్యక్షుడు కిరణ్ ఫిర్యాదుతో మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.