వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ప్రాంతంలో శనివారం రాత్రి కూడా అమెరికా సైన్యం ఇరాన్ లక్ష్యాలపై భారీ దాడులు జరిపింది. ఇరాన్‌కు చెందిన నిఘా వ్యవస్థలు, కమ్యూనికేషన్ కేంద్రాలు, గగనతల రక్షణ స్థావరాలు, డ్రోన్ గిడ్డంగులు, సముద్రపు మైన్లను అమర్చే సామర్థ్యాలపై అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి.’కికు’ అనే ముడిచమురు నౌక పై ఇరాన్ డ్రోన్ దాడి కి పాల్పడిన నేపథ్యంలో అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ ప్రతీకార చర్యలు చేపట్టిందని ఆమెరికా పేర్కొన్నది.