అమెరికాలో హెచ్-1బీ (H-1B) వీసాలపై డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు రద్దు చేసింది. ఈ నిబంధనను చట్టవిరుద్ధమని పేర్కొంటూ యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లియో సోరోకిన్ సోమవారం తీర్పునిచ్చారు.విదేశీ నిపుణులు ఇకపై ఆర్థికపరమైన అడ్డంకులు లేకుండానే అమెరికా శ్రామిక శక్తిలో భాగస్వాములు కావచ్చు. ప్రధానంగా భారతీయ సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, ఇంజనీర్లు, పరిశోధకులకు ఇది గొప్ప శుభవార్త.