మనీలాండరింగ్ కేసులో కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌కు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. సీఎంఆర్ఎల్-ఎక్సాలాజిక్ ఆర్థిక లావాదేవీల వివాదానికి సంబంధించి విచారణకు హాజరుకావాలంటూ ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో వీణా విజయన్‌తో పాటు కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్(సీఎంఆర్ఎల్) సంస్థకు చెందిన కీలక అధికారులతో కలిపి మొత్తం 9 మందికి ఈడీ సమన్లు పంపినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

