విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలో గత 33 ఏళ్లలో ఇంతటి ఘోర ప్రమాదం చోటుచేసుకోలేదని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ పరిశ్రమను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్మిక సంఘాల వ్యవహార శైలిపై కూడా పవన్ స్పందించారు కొన్ని కార్మిక సంఘాలు ప్రభుత్వాలను బట్టి తమ వైఖరిని మార్చుకుంటున్నాయని వ్యాఖ్యానించిన ఆయన, రాజకీయాలకు అతీతంగా కార్మికుల సంక్షేమం, భద్రతే ప్రధాన లక్ష్యంగా ఉండాలని సూచించారు.