స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది చనిపోవడం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారంతో పాటు ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.10లక్షల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. “భవిష్యత్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. రక్షణ చర్యల పట్ల యాజమాన్యం ఎలా ఉందో పూర్తిగా తెలుసుకోవాలి. ప్రమాద ఘటనపై కమిటీ విచారణ జరిపి నివేదిక ఇచ్చాక తదుపరి నిర్ణయాలు ఉంటాయి అని తెలిపారు.