మాదాపూర్‌లోని ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్ నాయక్ నివాసంలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో మోహన్ నాయక్ ఇంటితో పాటు ఏకకాలంలో 11 ప్రాంతాల్లోని ఆయన బంధువుల నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. ఇవాళ ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయని, సోదాలు పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.