నల్లగొండ పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున హ్యాపీ హోమ్స్ ఎదురుగా ఉన్న ఒక వెంచర్లో ఓ యువకుడిని దుండగులు అత్యంత కిరాతకంగా హత్యచేశారు. మృతుడిని గొల్లగూడ పెద్దబండ పరిధిలోని సత్యనారాయణ కాలనీకి చెందిన బోతు సాయిగా పోలీసులు గుర్తించారు. దుండగులు సాయిని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి, తీవ్రమైన కక్షతో బండరాళ్లతో ముఖంపై, తలపై మోదినట్లు తెలుస్తోంది. తల పూర్తిగా చిద్రమై, మెదడు బయటకు వచ్చేలా దారుణంగా కొట్టి చంపడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది.