విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన విషాదకర ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను, గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించేందుకు ఆయన నేరుగా విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బాధితుల కుటుంబాల్లో నెలకొన్న విషాదాన్ని పంచుకుంటూ వారికి ధైర్యం చెప్పారు. గాయపడిన కార్మికులను, వారి కుటుంబ సభ్యులను కలిసిన మంత్రి లోకేష్ ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. బాధితులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం వారి వెంటే నిలుస్తుందని భరోసా ఇచ్చారు.