సిఎం రేవంత్ అన్ని విధాలుగా సమర్ధుడని… పార్టీలు మారడంలో, ఢిల్లీకి డబ్బుల సంచులు మోయడంలోనూ, ప్రజలను తప్పుదోవ పట్టించడంలోనూ రేవంత్‌రెడ్డికి మించినవారు లేరని కిషన్‌రెడ్డి వ్యంగ్యంగా అన్నారు. రాబోయే బల్దియా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే సిఎం, బిజెపిని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. బల్దియాలో ఎన్నికలలో బిజెపి బలం ఏమిటో ముఖ్యమంత్రికి బాగా తెలుసు కాబట్టే, ఈ మధ్య పొద్దున లేస్తే బిజెపిపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు.

