ప్రపంచ సముద్ర దినోత్సవం
ప్రపంచ సముద్ర దినోత్సవం ప్రతి ఏట జూన్ 8న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. సముద్ర రక్షణ గురించి ప్రజల్లో అవగాహన పెంచడంకోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1992లో బ్రెజిల్ లోని రియో డి జనీరోలో జరిగిన ధరిత్రి సదస్సులో సముద్రాలమీద కూడా అవగాహన పెంచడంకోసం ప్రతి ఏటా సముద్ర దినోత్సవం జరపాలని కెనడా ప్రతిపాదించగా, 2005లో సునామీ వచ్చినపుడు జరిగిన అనర్థాలను దృష్టిలో ఉంచుకొని ఐక్యరాజ్యసమితి 2008, జాన్ 8న తొలిసారిగా ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించింది.

