మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. బత్తిని కుటుంబం ఏటా హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా.. సర్కారు పర్యవేక్షిస్తోంది. దీనికోసం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు ఇప్పటికే నగరానికి తరలివచ్చారు.