ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన కమిటీలను రద్దు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని జనసేన నాయకులలో క్రమశిక్షణ లోపించడమే ఇందుకు కారణమని జనసేన పార్టీ వెల్లడించింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని జనసేన నేతలు పార్టీ విదానాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని.. నేతల తీరుపై మద్దతుదారుల నుంచి తమకు ఫిర్యాదులు వస్తున్నాయని జనసేన పార్టీ వెల్లడించింది.