రష్యా ప్రభుత్వానికి చెందిన ప్రముఖ రేర్ ఎర్త్ (విశిష్ట ఖనిజాల) పరిశోధన సంస్థ ‘గిరెడ్‌మెట్ ఇనిస్టిట్యూట్’ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండు భారీ ప్రాజెక్టులను నెలకొల్పడానికి ఉన్న అవకాశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో లభించే అపారమైన భారీ ఖనిజ సంపదను సమర్థవంతంగా వినియోగించుకోవాలని మంత్రి లోకేష్ ప్రతిపాదించారు. అక్కడ అత్యాధునిక సాంకేతికతతో కూడిన ‘డీప్ ప్రాసెసింగ్ & రేర్ ఎర్త్ ఎలిమెంట్ రిఫైనింగ్ హబ్’ను ఏర్పాటు చేయాల్సిందిగా రష్యా సంస్థను కోరారు.