సైబరాబాద్ డీసీపీ రీతిరాజ్ సాధారణ కస్టమర్ లా ఓ పబ్లోకి వెళ్లి అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను గుర్తించారు.
‘కింగ్స్ అండ్ క్వీన్స్’ పబ్లో శనివారం అర్ధరాత్రి ఎలాంటి హడావుడి లేకుండా, సెక్యూరిటీ సిబ్బందిని పక్కనపెట్టి సాధారణ కస్టమర్ లా పబ్ లోకి ప్రవేశించారు. పబ్ లో జరుగుతున్న కార్యకలాపాలను మొబైల్ ఫోన్లో వీడియోలు చిత్రీకరించారు. డీసీపీ రీతిరాజ్ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఉన్నతాధికారి స్వయంగా కస్టమర్లా వెళ్లి తనిఖీలు నిర్వహించడం అరుదైన విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.