నీట్‌తో సహా జాతీయ పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహించి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేసేవరకు తమ ఉద్యమం ఆగదని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లోని తన నివాసానికి వచ్చిన అభిజీత్, మీడియాతో మాట్లాడారు. కేంద్రంపై యువతకు ఉన్న వ్యతిరేకతకు అదే నిదర్శమన్నారు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని, దేశవ్యాప్తంగా ఉద్ధృతం చేస్తామని అభిజీత్ ప్రకటించారు. సీజేపీ తదుపరి కార్యచరణను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.