కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్విన్స్ పబ్‌లో గలీజ్ పనులు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం తెల్లవారుజామున డిసిపి రితిరాజ్ ఆధ్వర్యంలో పోలీసులు పబ్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు. కస్టమర్లను ఆకర్షించేందుకు అమ్మాయిలను పబ్ యాజమాన్యం ఏర్పాటు చేసింది. అమ్మాయిలతో చాటింగ్‌లు చేయించి యువకులను పబ్‌కు రప్పిస్తున్నారు. పబ్‌లో డ్యాన్స్ ఫ్లోర్ ఏర్పాటు చేసి కస్టమర్లను మేనేజ్మెంట్ ఆకర్షిస్తుంది. పబ్‌లోని విటులతో పాటు యువతులను అదుపులోకి తీసుకున్నారు. పబ్ మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.