టీజీ 20 లీగ్ వేలంలో అభిరత్ రెడ్డిని హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కొనుగోలు చేసింది. రూ.11లక్షలకు ఆ జట్టు దక్కించుకుంది. మరోవైపు అన్విత్రెడ్డిని రూ.3.5లక్షలకు అదే జట్టు తీసుకుంది. భావేశ్ను వరంగల్ వారియర్స్ రూ.5 లక్షలకు, నిశాంతన్ను రూ. 5.5లక్షలకు నల్గొండ నైట్స్, అవినాష్ రావును రూ.7 లక్షలకు రంగారెడ్డి రైజర్స్, మయాంక్ న్ను బేస్ ధర రూ. 3లక్షలకు ఖమ్మం ఏసెస్ సొంతం చేసుకున్నాయి.