తెలంగాణలో పాఠశాలలు జూన్ 15 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం జూన్ 12న ప్రారంభం కావాల్సి ఉండగా.. జూన్ 13 రెండో శనివారం, 14 ఆదివారం కావడంతో ప్రభుత్వం షెడ్యూల్లో మార్పు చేసింది. జూన్ 13 రెండో శనివారం బదులు జులై 11న తరగతులు నిర్వహించనున్నారు.