పోలవరం జిల్లాలోని దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్దపులి మరోసారి ఆసక్తికర దృశ్యాలతో అటవీశాఖ కెమెరాలకు చిక్కింది. పర్యాటక ప్రాంతమైన నేలకోట కూడిపల్లి కొండల సమీపంలోని దట్టమైన చెట్ల కింద పెద్దపులి ఎంతో ప్రశాంతంగా కూర్చొని ఆడుకుంటూ, అక్కడి కొమ్మలు, ఆకుల వాసన చూస్తూ గడిపిన దృశ్యాలను డ్రోన్ కెమెరా ద్వారా అటవీశాఖ అధికారులు రికార్డు చేశారు. గత మూడు రోజులుగా పెద్దపులి కొండ ప్రాంతానికే పరిమితమైందని ఇప్పటివరకు గ్రామాల్లోకి ప్రవేశించడం గానీ, పశువులపై దాడి చేయడం గానీ జరగలేదని తెలిపారు.