ప్రపంచంలోనే అత్యంత క్రూరడైన నియంత హిట్లర్ ఆదర్శం కాబట్టే రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అరాచకాలు చేస్తున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరులో జరిగిన ఓ కాంక్లేవ్‌లో సిఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కెటిఆర్ ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థకు, దాని పనితీరుకు జర్మనీ నియంత ఆడాల్ఫ్ హిట్లర్ చర్యలే స్ఫూర్తి అని ముఖ్యమంత్రి బహిరంగంగా ఒప్పుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.