ఖమ్మంలో ఓ 12 ఏళ్ల మైనర్ బాలికపై ఈ నెల 6న ఓ దుర్మార్గుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఎక్కడ దొరికిపోతానోననే భయంతో ఆమెను భవనం పైనుంచి కిందకు తోసేశాడు. ఈ ప్రమాదంలో బాలిక వెన్నెముక, చేతులు, కాళ్ళు, పక్కటెముకలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతోంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసును తీవ్రంగా పరిగణిస్తూ, నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.