యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అభిమానులను పూర్తిగా నిరాశపర్చాడు. ఇండియా ‘ఎ’, శ్రీలంక ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరుగుతున్న ట్రై-సిరీస్‌లో తొలి మ్యాచ్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీకి ఓపెనర్‌గా ఆడే అవకాశం లభించింది. తొలి బంతి నుంచే తన సహజ శైలిలో షాట్లు ఆడుతూ ఆకట్టుకున్నాడు. కేవలం 12 బంతులు ఎదుర్కొన్న వైభవ్ మూడు అద్భుతమైన బౌండరీల సాయంతో 14 పరుగులు సాధించాడు. అయితే మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మార్చుకునే అవకాశాన్ని అతడు చేజార్చుకున్నాడు