మంత్రి నారా లోకేష్ విశాఖ మృతుల కుటుంబాలు, గాయపడిన కార్మికులను పరామర్శించారు. కానీ అక్కడే కార్మిక సంఘాల నాయకులు ఆయన చుట్టూ చేరి తీవ్ర ఆందోళన చేశారు. “చాలా ఏళ్లుగా ఉన్న సమస్యలు ఏవీ పరిష్కరించలేదు. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి” అంటూ కార్మికులు, స్టీల్ ప్లాంట్ బాధితులు పరిహారం కోసం డిమాండ్ చేశారు. ఇది కేవలం ఒక్క ప్రమాదం కాదు, సుదీర్ఘకాలిక నిర్లక్ష్యం ఫలితమని వారు మండిపడ్డారు. దీనిపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ రాబట్టలేకపోయారని కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.