పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన మహిళా ఐపీఎస్ అధికారిణిపై హిందూ సంఘాలు ఫిర్యాదుతో ప్రభుత్వం బదిలీ చేయడంపై తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. ఆమె ముస్లిం కావడంతో తన వీడియో ఆరంభంలో ‘అస్సలాం అలైకుమ్’ అనే ఇస్లామిక్ సందేశాన్ని ఉపయోగించారని, దీనిని ఎలా ఉపయోగిస్తారని హిందూ సంస్థ పశ్చిమ బెంగాల్ హోమ్ కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెపై బదిలీ వేటు పడింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిని సాధారణ బదిలీగా చెబుతున్నప్పటికీ అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి.