ఇవాళ భారతీయ స్టాక్ మార్కెట్లు రోజంతా తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగి అంతిమంగా మిశ్రమంగా ముగిశాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, అంతర్జాతీయ మార్కెట్ సంకేతాల నేపథ్యంలో బెంచ్ మార్క్ సూచీలు పరిమిత శ్రేణిలోనే ట్రేడ్ అయ్యాయి. నిఫ్టీ 53.00 (0.23శాతం) పాయింట్లు పెరిగి 23,270.60 దగ్గర ముగియగా, సెన్సెక్స్ 21.86 (0.029శాతం) కోల్పోయి 74,314.59 దగ్గర స్థిరపడింది.