వారణాసి క్షేత్రంలో శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకుని పవిత్ర జలాలతో ప్రత్యేక అభిషేకం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినంతో పాటు ఆయన 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాపాలనా ప్రస్థానాన్ని పురస్కరించుకుని చేపట్టిన ‘వారణాసి-వాద్నగర్ సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ఈ పూజలు నిర్వహించారు.