కాంగ్రెస్ బయటపెట్టిన 2004 ఎలక్షన్ కేసీఆర్ అధికారిక అఫిడవిట్ ప్రకారం.. ఆయన పేరిట వ్యవసాయ భూమి 0 ఎకరాలు , వ్యవసాయేతర భూమి 0 ఎకరాలు అని స్పష్టంగా నమోదై ఉంది. 1954 నుంచే వందలాది ఎకరాల జమీందారీ ఆస్తులు తమకు ఉన్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించినప్పుడు, 2004 నాటికి అధికారిక అఫిడవిట్లో సొంత పేరిట సున్నా ఎకరాలు ఉన్నట్లు ఎందుకు పేర్కొన్నారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. కేటీఆర్ చెప్పే జమీందారీ లెక్కలు నిజమా? అధికారిక వివరాలు నిజమా? అంటూ టీపీసీసీ నేతలు నేరుగా నిలదీస్తున్నారు