కర్నూలు జిల్లా ఆదోనిలోని తిరుమల నగర్లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 12 అడుగుల భారీ గణపతి విగ్రహం చుట్టూ పత్తితో ఉన్న అలంకరణకు మంటలు అంటుకుని వేగంగా వ్యాపించాయి. వినాయక మండపంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడున్న భక్తులు, స్థానికులు తీవ్ర ఆందోళనతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం నిర్వాహకులు విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.