భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుందని.. దీన్ని ఎవరూ ఆపలేరని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వారణాసిలో నిర్వహించిన సేవా సంకల్ప్ అభియాన్ లో ఆయన మాట్లాడారు. “దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ జరుగుతోంది. ప్రధాని మోదీ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. సుమారు 11 కోట్ల మంది పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. మధ్యవర్తులు లేకుండా రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నారు” అని అన్నారు.