రెండేళ్ల క్రితం ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత బెంగళూరు-తాడేపల్లి నివాసాల మధ్య షటిల్ సర్వీస్ చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ లోటస్ పాండ్ కు
వచ్చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసంలో ఉంటూ మధ్యలో తాడేపల్లి ఇంటికి వచ్చి వెళ్లినా ఇబ్బందులు ఉండకపోవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే ప్రస్తుతం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సైతం ఇలాగే చేస్తున్నారు. ఆయన్ను విమర్శించేందుకు వీళ్లు సాహసించకపోవచ్చని భావిస్తున్నారు.

