మహారాష్ట్రకు చెందిన తన్వీర్ దాదాపు 180 మంది బాలికలను లైంగికంగా వేధించి.. 350కి పైగా అశ్లీల వీడియోలు చిత్రీకరించిన నిందితుడి ఇంటిపై మహారాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్ ఆపరేషన్ చేపట్టింది. అతడి నివాసానికి సమీపంలోని అక్రమ కట్టడాలను సైతం స్థానిక మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. భాజపా ఎమ్మెల్యే ప్రవీణ్ పర్యవేక్షణలో ఈ కూల్చివేతలు జరిగినట్లు తెలిపారు. అక్రమ నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ నిందితుడి కుటుంబానికి గతంలోనే నోటీసులు జారీ చేశామని అధికారులు పేర్కొన్నారు. వాటిపై ఎటువంటి స్పందన రాకపోవడంతో కూల్చివేత చేపట్టామన్నారు.

