ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఢిల్లీ హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు. తాను నిందితుడిగా ఉన్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు విచారణ నుంచి జస్టిస్ స్వర్ణ కాంత శర్మను తప్పించాలని మరోసారి కోరారు. అదే కేసులో కేంద్రం తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ కింద ఆ న్యాయమూర్తి కుమారుడు పని చేస్తున్నట్లు కేజ్రీవాల్ ఆరోపించారు. జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ముందు జరిగే విచారణ నిష్పక్షపాతంగా లేదా తటస్థంగా ఉండదనే
అనుమానం తనకు ఉన్నదని ఆయన పేర్కొన్నారు.

