ఉత్తర్ ప్రదేశ్ నొయిడాలో కార్మికుల ఆందోళన హింసాత్మకంగా మారడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నొయిడా డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ మేధా రూపమ్ లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
“బెంగాల్లో శాంతిభద్రతలపై సీఈసీ జ్ఞానేశ్ కుమార్ జ్ఞానబోధ చేస్తుంటారు. కానీ పిల్లలకు మాత్రం ఆ అంశంపై కనీస విషయాలు బోధించలేదు పాపం. నొయిడా డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ గా ఉన్న ఆయన కుమార్తెకు న్యాయపరమైన నిరసనలను ఎలా ఎదుర్కోవాలో తెలియదు. సిగ్గుచేటు” అంటూ మొయిత్రా దుయ్యబట్టారు.

