సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనుదీప్ ఇటీవల ఒక షోలో పవన్ కళ్యాణ్, నిహారిక కొణిదెల, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, బాలకృష్ణలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కాకినాడకు చెందిన జనసేన పార్టీ నాయకులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో తన కుటుంబాన్ని కలవడానికి వెళ్లిన అనుదీప్‌ను, ఏప్రిల్ 14న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఒక పార్కులో తన తండ్రితో ఉన్న సమయంలో కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు.

