జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ విషయంలో కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు తీరని అన్యాయం చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కావలి నియోజకవర్గం బోగోలు మండలంలో మత్స్యకారులతో ప్రత్యేకంగా ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ఈ హార్బర్‌ను మత్స్యకారులకు కాకుండా కార్పొరేట్ సంస్థలకు, కట్టబెట్టేందుకు భారీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
జువ్వలదిన్నె హార్బర్‌ను జాతికి అంకితం చేసి రెండేళ్లు అవుతున్నా ఇప్పటికీ దాన్ని మత్స్యకారుల చేతికి ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

