సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇంట్లో నిల్వ ఉంచిన డిటోనేటర్లు పేలి గ్యాస్ సిలిండర్లకు మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది.

