భారతదేశ అభివృద్ధి కోసం కృషి చేసిన నేరానికి తమిళనాడు, దక్షిణ రాష్ట్రాలకు శిక్ష విధిస్తున్నారా? అని స్టాలిన్ కేంద్రాన్ని ప్రశ్నించారు.డీలిమిటేషన్ సవరణ బిల్లు, తమిళనాడు, దక్షిణ రాష్ట్రాలపై రుద్దబడిన ఒక “భారీ చారిత్రక అన్యాయం”! అన్నారు. వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్న ప్రతి దక్షిణాదివాసి తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాడని, బీజేపీ నిప్పుతో ఆడుకుంటోందని స్టాలిన్ తెలిపారు. రేపు, డీలిమిటేషన్‌కు నిరసనగా తమిళనాడు వ్యాప్తంగా ఇళ్లపైనా, బహిరంగ ప్రదేశాలపైనా నల్ల జెండాలు ఎగురవేస్తారని, అన్నింటికంటే ముఖ్యంగా ఆత్మగౌరవం గల తమిళుడిగా హెచ్చరిస్తున్నట్లు స్టాలిన్ తెలిపారు.

