ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరును ఇంగ్లీష్‌లో రాసేటప్పుడు ఏర్పడుతున్న గందరగోళానికి తెరదించుతూ ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఇకపై అన్ని ప్రభుత్వ అధికారిక నోట్లు, పత్రాలు, కమ్యూనికేషన్లలో “AMARAVATI” అని మాత్రమే ఉండాలి. ఇంగ్లీష్‌లో రాసేటప్పుడు చివరిలో ‘THI’ (Amaravathi) కి బదులుగా ‘TI’ (Amaravati) అని మాత్రమే వాడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

