మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మున్సిపాల్టీ బడ్జెట్ సమావేశం సమయంలో ఇద్దరు కార్పొరేటర్లు.. వందేమాతరం గీతాన్ని ఆలపించని విషయం తెలిసిందే. కాంగ్రెస్ కార్పొరేటర్ ఫౌజియా షేక్ ఆలిమ్ వందేమాతర గీతం పాడేందుకు వ్యతిరేకించారు. ఇస్లామిక్ విశ్వాసాల ప్రకారం ఆ పాట పాడలేనని చెప్పిందామె. మరో కార్పొరేటర్ రూబినా ఇక్బాల్ ఖాన్ కూడా ఫౌజియాకు మద్దతు పలికింది. ఆ ఇద్దరు జాతీయ గీతాన్ని ఆలపించేందుకు నిరాకరించారు. 196 బీఎన్ఎస్ సెక్షన్ కింద ఫౌజియా, రుబినాపై కేసు నమోదు అయ్యింది.

