ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. హరియాణాలోని వివాదాస్పద షిఖోపూర్ ల్యాండ్ డీల్ కేసులో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై రాబర్ట్ వాద్రాకు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. మే 16న కోర్టులో హాజరు కావాలని వాద్రాకు ఆదేశాలు జారీ చేశారు. ఈడీ గత ఏడాది జూలైలో ఈ కేసుపై చార్జిషీట్ దాఖలు చేసింది. వాద్రాపై దాఖలైన తొలి ఛార్జిషీటు ఇదే.

