పాలిటెక్నికల్ విద్యార్థుల పోరాటం ఫలించింది. పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. పాత పద్ధతిలోనే పాలిటెక్నిక్ విద్యను కొనసాగించాలని నిర్ణయించింది. సాంతికే విద్యా శాఖ, సాంకేతిక విద్యా మండలి ఇప్పుడున్న విధంగా ఉంటాయని స్పష్టం చేసింది. మూడేళ్ల డిప్లొమా కోర్సుల నిర్వహణలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండబోవని.. విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీ.టెక్ కోర్సుల్లో చేరవచ్చని వివరించింది. అంతేగాకుండా.. ఏఐసీటీఈ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని తేల్చి చెప్పింది.