తాను వాళ్లూ వీళ్లూ వదిలిన బాణాన్ని కాదని, దశాబ్దాలుగా అధికారానికి, విద్యకు దూరంగా ఉన్న బహుజనుల బాణాన్ని అని స్పష్టం చేశారు. బహుజనుల హక్కుల కోసం ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ తో అయినా కొట్లాడేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్, మోదీలతో పోరాటం చేసి చూపిస్తానని కవిత కొడంగల్‌లో ‘పాంచజన్య సంకల్ప సభ’ లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరి మద్దతు లేకుండా ఒక మహిళ రాజకీయంగా ఎదగగలదని నిరూపిస్తానని తెలిపారు.