రష్మిక కీలక పాత్రలో రవీంద్ర పుల్లె దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మైసా’ అన్ ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబరు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్ర టీజర్ విడుదలైంది. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో.. రష్మిక శక్తిమంతమైన గిరిజన గోండు మహిళ పాత్రలో అలరించనున్నారు. ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.