ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ పాలనలో 151 అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసమయ్యాయని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. అయితే కేవలం 14 కేసుల్లో మాత్రమే అరెస్టులు జరిగాయని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చాలనే బీజేపీ ప్రయత్నంలో భాగంగానే ఉద్దేశపూర్వకంగా ఈ విధ్వంసకాండ జరిగిందని ఆయన విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో అంబేద్కర్ విగ్రహాల ధ్వంసానికి సంబంధించిన కేసుల వివరాలను సమాజ్‌వాదీ పార్టీ స్వయంగా,పోలీస్ కేసులు, ప్రభుత్వ సమాచారం ఆధారంగా సేకరించిందని అఖిలేష్ యాదవ్ తెలిపారు